Thu Mar 19 2026 19:18:59 GMT+0530 (India Standard Time)
Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
శ్రీశైలంలో అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది

శ్రీశైలంలో అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. తెలంగాణా రాష్ట్రంలోని మన్ననూర్ నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు 55 కిలోమీటర్ల మేర అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం, ఎన్. టీ.సీ.ఏకు పంపిందని అధికారులు తెలిపారు.
అతి పెద్ద ఫ్లైఓవర్...
ఈ అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కోసం కేంద్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇది కార్యరూపం దాలిస్తే దేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్గా నిలవనుందని అధికారులు తెలిపారు. మన్ననూరు నుంచి దట్టమైన అడవుల అందాలను వీక్షిస్తూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేరుగా శ్రీశైలం వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది.
Next Story

