Thu Jan 29 2026 01:46:02 GMT+0000 (Coordinated Universal Time)
Modi : కేంద్రం గుడ్ న్యూస్... ఇక వారి కోరిక నెరవేరినట్లేనా?
ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర కేబినెట్ కారయదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయనతో పాటు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది.
కమిటీని నియమిస్తూ...
ఈ కమిటీలో ఐదుగురు సభ్యులుగా కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక, న్యాయశాఖ కార్యదర్శులు కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొంది. తెలంగాణలో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఈ ఉత్తర్వులు జారీ చేసిందన్న రాజకీయ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ హైదరాబాద్ లో గతంలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story

