Thu Dec 18 2025 07:28:00 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు భారీ ప్రాజెక్టు: మోదీ
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టును ప్రకటించింది. మెగా టెక్స్టైల్ ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ తెలిపారు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టును ప్రకటించింది. మెగా టెక్స్టైల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు తమిళనాడు, క్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ టెక్స్టైల్ పార్క్‌లను ఏర్పాటు చేయబోతున్నామని మోదీ ట్విట్టర్ లో వెల్లడించారు.
లక్షలాది మందికి ఉపాధి....
పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు టెక్స్ టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని మోదీ చెప్పారు.. కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తాయని, లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని తెలిపారు. ఇది 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఫర్ ది వరల్డ్'కి గొప్ప ఉదాహరణ అవుతుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ పార్క్ ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు అందించిన కానుక అని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
- Tags
- modi
- mega textile
Next Story

