Wed Jan 28 2026 18:21:02 GMT+0000 (Coordinated Universal Time)
BRS : కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ రెస్సాన్స్...నివేదిక ఇవ్వాలంటూ...
బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరింది

బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరింది. ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారన్న ఆరోపణలపై ఆయనపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కోరింది. తనను ఈసారి గెలిపిస్తే విజయయాత్ర లేకుంటే శవయాత్ర చేస్తానంటూ ఒకరకంగా ప్రజలకు హెచ్చరికల్లా కౌశిక్ రెడ్డి చేశాడన్న ఆరోపణలున్నాయి. ఇది బ్లాక్ మెయిలింగ్ కిందకు వస్తుందని కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది.
బ్లాక్ మెయిలింగ్ కింద...
కాగా పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఎదుర్కొంటున్నారు. గత ఉప ఎన్నికల్లోనూ హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ గెలుపొందారు. అయితే కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ హైకమాండ్ ఎమ్మెల్సీని చేసింది. తర్వాత ఈ ఎన్నికలలో పార్టీ తరుపున పోటీకి దింపింది. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరవచ్చు కానీ, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామనేలా బెదిరింపులకు దిగడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
Next Story

