Fri Dec 05 2025 13:37:38 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మంత్రి వర్గ సమావేశం నిర్వహణకు ఈసీ ఓకే
తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.

తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. అయితే అందుకు కొన్ని షరతులు విధించింది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీ లోపు చేయాల్సిన అత్యవసర విషయాలను మాత్రమే చర్చించాలని తెలిపింది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించవద్దని తెలిపింది.
షరతులతో కూడిన అనుమతి...
వాస్తవానికి నిన్ననే తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది. అయితే ఎన్నికల కమిషన్ అనుమతివ్వడం, షరతులు విధించడంతో మంత్రి వర్గ సమావేశం ఎప్పుడు నిర్ణయిస్తారన్న దానిపై మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు.
Next Story

