Tue Mar 31 2026 14:13:27 GMT+0530 (India Standard Time)
మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన
తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ మే నెల నుంచి ప్రారంభం కానుంది

తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ మే నెల నుంచి ప్రారంభం కానుంది. ముందుగా ఇళ్ల సర్వే ఏపీలో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు జనగణన జరుగుతుంది. ఆ తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏపీలో మే 16 నుంచి 30, తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10 తేదీల మధ్య చేపట్టనున్నారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్..
ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ప్రజలు తమ ఇళ్ల సమాచారాన్ని సెన్సస్ వెబ్సైట్లో నమోదు చేస్తారు. ఇళ్ల సర్వేలో భాగంగా 34 ప్రశ్నలు అడగనున్నట్లు సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ మీడియా సమావేశంలో వెల్లడించారు. జనగణనకు పౌరులు సహకరించాలని కోరారు.
Next Story

