Sun Mar 15 2026 18:20:06 GMT+0530 (India Standard Time)
చీఫ్ సెక్రటరీకి సీబీఐ మరోసారి లేఖ
ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి వివరాలను తమకు అప్పగించాలని సీబీఐ ఛీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది

చీఫ్ సెక్రటరీకి సీబీఐ మరోసారి లేఖ రాసింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి వివరాలను తమకు అప్పగించాలని సీబీఐ ఛీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. ఇప్పటికే ఐదు సార్లు లేఖలు రాసిన సీబీఐ మరోసారి లేఖ రాసింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసును సీబీఐ కి అప్పగిస్తూ హైకోర్టులో సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ లు తీర్పునిచ్చాయి.
ఆరోసారి...
అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 17న దీనిపై విచారణ చేపడతామని తెలిపింది. సుప్రీంకోర్టులో విచారణకు ఇంకా పది రోజులు గడువు ఉండటంతో హైకోర్టు తీర్పు ప్రకారం ఈ కేసు వివరాలను తమకు అప్పగించాలని సీబీఐ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. మరి చీఫ్ సెక్రటరీ ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story

