Mon Mar 16 2026 16:02:45 GMT+0530 (India Standard Time)
కవితకు సీబీఐ లేఖ.. ఆరోజు కలుద్దామంటూ?
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు సీబీఐ సమాధానం ఇచ్చింది. ఈ నెల 11న హైదరాబాద్ ఇంట్లో సమావేశం అవుదామని లేఖలో పేర్కొంది

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు సీబీఐ నుంచి సమాధానం వచ్చింది. ఈ నెల 11న హైదరాబాద్ ఇంట్లో సమావేశం అవుదామని లేఖలో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారించేందుకు సహకరించాలని, ఈ నెల 6వ తేదీన ఎక్కడ కలవాలో చెప్పాలని కవితకు తొలుత సీబీఐ లేఖ రాసింది.
11న ఉదయం 11 గంటలకు...
అయితే తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా 6వ తేదీన తాను అందుబాటులో ఉండనని, 11,12,14, 15 తేదీల్లో వస్తే తాను అందుబాటులో ఉంటానని కవిత లేఖ రాశారు. 11న ఉదయం 11 గంటలకు తాము వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటామని సీబీఐ తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు. సీీబీఐ అధికారులు ఈమెయిల్ ద్వారా కవితకు ఈ విషయాన్ని తెలియజేశారు.
Next Story

