Fri Dec 05 2025 17:52:35 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ కోర్టులో గాలికి చుక్కెదురు
మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది

మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ గాలి జనార్థన్ రెడ్డి వేసిన పిటీసన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. అక్రమాల కేసులో అరెస్టయిన వారికి స్పెషల్ కేటగిరీ కింద వసతులు కల్పించలేమని సీబీఐ కోర్టు అభిప్రాయపడింది. దీంతో గాలి జనార్థన్ రెడ్డి పిటీషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
స్పెషల్ కేటగిరీ కింద...
ఇటీవల ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్థన్ రెడ్డితో పాటు మరికొందరికి ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఆయనను చంచల్ గూడ జైలులో ఖైదీగా ఉన్నారు. తనకు జైలులో వసతులు కల్పించాలని సీబీఐ కోర్టులో గాలి జనార్థన్ రెడ్డి వేసిన పిటీషన్ ను పరిశీలించిన సీబీఐకోర్టు దానిని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story

