Fri Dec 05 2025 12:39:45 GMT+0000 (Coordinated Universal Time)
Caste Census : సర్వే గడువు పెంచుతారా? లేక ఇంతటితో ముగిస్తారా?
కులగణన సర్వే తెలంగాణలో నేటితో ముగియనుంది.

కులగణన సర్వే తెలంగాణలో నేటితో ముగియనుంది. ఇప్పటి వరకూ కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16వ తేదీ నుంచి రీ సర్వే ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికి పదకొండు రోజులయినా గతంలో తెలంగాణలో జరిగిన సర్వేలో పాల్గొనని వారు ఈ రీసర్వేలోనూ పాల్గొనడం లేదు. సర్వే పట్ల పెద్దగా ప్రజలు ఆసక్తి కనపర్చడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 3.56 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనాల్సి ఉందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రీసర్వేలోనూ పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో గడువు పెంచుతారా? లేక ఇంతటితో ముగించనున్నారు.
అదే అసలు సమస్య...
బీసీ రిజర్వేషన్ల కోసమే కులగణన సర్వే నిర్వహిస్తున్నారని తెలియడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సర్వే జరుపుతున్నారని ప్రచారం జరగడంతో తమకు సంబంధం లేని విషయమని చాలా మంది సర్వేకు దూరంగా ఉన్నారు. గతంలో సర్వే నిర్వహించినప్పుడు ఇంటికి తాళం వేసిన వారు ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబరుతో పాటు ప్రభుత్వం అనేక రకాలుగా సమాచారం అందిస్తే ఎన్యుమరేటర్లు వస్తారని చెబుతున్నా ఫలితం కనిపించడం లేదు. తమ ఆస్తుల వివరాలను, కుటుంబ వివరాలను చెప్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
దూరంగా నేతలు...
ప్రధానంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో కవిత తప్ప మరెవ్వరూ సర్వేలో పాల్గొనలేదు. అలాగే బీజేపీ ఎంపీ డీకే అరుణ సయితం తాను సర్వేలో పాల్గొనబోనని తెలిపారు. అయితే తమ వివరాలన్నీ ఎన్నికల అఫడవిట్ లో ఉంటాయని, ప్రత్యేకంగా సర్వేలో పాల్గొనాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హరీశ్ రావు కూడా తన కుటుంబ వివరాలను అందించలేదు. ఇక ప్రభుత్వం కూడా టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసినా, ఆన్ లైన్ లోనైనా తమ వివరాలను ప్రభుత్వానికి అందించవచ్చని, సర్వేకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. టొల్ ఫ్రీ నెంబరుకు ఏడు వేల కు మించి కాల్స్ రాలేదు.
Next Story

