Sun Feb 01 2026 05:15:17 GMT+0000 (Coordinated Universal Time)
18 కోట్ల నగదు.. 15 కిలోల బంగారం సీజ్
మల్లారెడ్డి ఇంట్లోనూ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్లలోనూ 18,5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు ముగిశాయి. అయితే ఈ సోదాల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెక్క చూపని వాటిని సీజ్ చేసినట్లు తెలిసింది. దాదాపు రెండు రోజుల పాటు మల్లారెడ్డి ఇళ్లు, ఆయన కుటుంబీకులు, సన్నిహితులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.
ఐటీ దాడుల్లో...
మల్లారెడ్డి ఇంట్లోనూ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్లలోనూ 18,5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. అలాలే 15 కిలోల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని సీజ్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ సొమ్ము ఇటీవల ఇంజినీరింగ్ కళాశాలల అడ్మిషన్లు పూర్తి కావడంతో వచ్చినవిగా చెబుతున్నారు. ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story

