Sun Mar 15 2026 23:15:10 GMT+0530 (India Standard Time)
KTR : బంజారాహిల్స్లో కేటీఆర్ పై కేసు
మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2,500 కోట్ల రూపాయలను ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై ఈ కేసు నమోదయింది. కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈ కేసును పోలీసులు నమోదు చేశారు.
రేవంత్ పై...
తొలుత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు స్వీకరించిన హనుమకొండలో కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు పంపారు. ముఖ్యమంత్రి రేవంత్ పై అనవసర ఆరోపణలు చేస్తూ ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story

