Wed Mar 18 2026 01:08:31 GMT+0530 (India Standard Time)
ఎంపీ అరవింద్ పై క్రిమినల్ కేసు నమోదు
నిజమాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు

నిజమాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు శాఖ ను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 3వ తేదీన తన నివాసం వద్ద పోలీసుల అధికారులను ఉద్దేశించి ధర్మపురి అరవింద్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
పోలీసుల పై...
కేటీఆర్, కేసీఆర్ లకు చెంచాగిరీ చేస్తున్నారని, లాఠీలు పనిచేయడం లేదా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసు శాఖపై ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై బంజారాహిల్స్ సీఐ శివచంద్ర ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీసీ 294, 504, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Next Story

