Thu Mar 19 2026 05:53:52 GMT+0530 (India Standard Time)
విషాదం : వరదలో కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు మృతి
చల్ గల్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా.. ఫాజుల్ నగర్ చౌరస్తా కల్వర్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. చల్ గల్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా.. ఫాజుల్ నగర్ చౌరస్తా కల్వర్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కల్వర్టు వద్ద కారు వరదలో కొట్టుకుపోవడం గమనించిన స్థానికులు జేసీబీ సహాయంతో రక్షించేందుకు ప్రయత్నించారు.
ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఇద్దరిని రక్షించి.. మరో ఇద్దరినీ కాపాడే లోపు కారు నీటిలో కొట్టుకు పోయింది. దాంతో అందులో ఉన్న మరో ఇద్దరు మరణించారు. గంగ, ఆమె మనవడు కిట్టు ప్రాణాలు కోల్పోయారు. వరద నీటిలో కొట్టుకుపోయిన కారును స్థానికులు కొద్దుదూరంలో బయటకు తీసి, అందులోని మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story

