Thu Jul 07 2022 08:02:04 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్: ఫ్లై ఓవర్ పై నుండి కిందకు పడ్డ కారు

వరంగల్లోని ఫ్లైఓవర్ నుండి కారు కిందపడడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వరంగల్ ఉరుసుగట్టు వద్ద ఖమ్మం బైపాస్ హంటర్ రోడ్డు ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అప్డేట్: మృతి చెందిన వారిని ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన దంపతులని.. ప్రభుత్వ ఉద్యోగి సారయ్య (42), ఆయన భార్య సుజాత(39)గా గుర్తించారు. గాయపడిన డ్రైవర్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరో రోడ్డు ప్రమాదం:
బొల్లికుంటలో ఉన్న వాగ్దేవి కాలేజ్ సమీపంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు.
Next Story