Sun Mar 15 2026 03:13:44 GMT+0530 (India Standard Time)
Big Breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. లాస్య ఇటీవల జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లాస్య వయసు 37 సంవత్సరాలు. పటాన్ చెరు అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే...
డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి గల కారణమని తెలుస్తోంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న గత ఏడాది మరణించారు. ఆమె కుమార్తెకు లాస్య బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో గెలిచిన లాస్య చిన్న వయసులోనే మరణించడంతో పార్టీ కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎక్కడి నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story

