Wed Mar 18 2026 04:12:38 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల 27వ తేదీన ఎన్నిక జరగనుంది. ఇక ఏపీలో గుంటూరు, కృష్ణా జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏపీలోనూ...
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరోజు ఆ జిల్లా పరిధిలో ప్రభుత్వ టీచర్లకు సెలవు ప్రకటించారు.
Next Story

