Sat Mar 21 2026 01:42:40 GMT+0530 (India Standard Time)
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త పథకాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభల నిర్వహణలు, వాటి కోసం చేయాల్సిన వ్యయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన అనుచరులతో చర్చించనున్నారు.
దశాబ్ది ఉత్సవాలు...
దీంతో పాటుగా దళిత బంధు పథకం త్వరితగతిన అమలు జరిగేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికను రూపొందించనున్నారు. ఆన్ గోయింగ్ పథకాలు నోటిఫికేషన్ విడుదలయినా కొనసాగించ వచ్చన్న కారణంతో దళిత బంధు ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొత్త సచివాలయంలో తొలి సారి మంత్రి వర్గ సమావేశం జరగనుంది. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story

