Fri Dec 05 2025 20:14:48 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేవేసేందుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనుంది. ఇద్దరు పిల్లల నిబంధనపై ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చేందుకు ఆమోదం తెలిపింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై...
దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగా కల్పించే అవకాశం లేనందున, పార్టీ పరంగా కల్పించాలని కూడా కొందరు మంత్రులు చేసిన సూచనలకు రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఇంకా కొనసాగుతుంది. మరికాసేపట్లో నిర్ణయాలను అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Next Story

