Thu Mar 19 2026 01:39:56 GMT+0530 (India Standard Time)
నిర్మాణంలో ఉన్న భవనం కూలి పలువురికి గాయాలు..
ఆ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి సమీపంలోని నాలుగు అంతస్తుల భవనంలో నిర్మాణ పనులు జరుగుతుండగా..

హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి పలువురికి గాయాలయ్యాయి. కూకట్ పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి సమీపంలోని నాలుగు అంతస్తుల భవనంలో నిర్మాణ పనులు జరుగుతుండగా.. నాల్గవ అంతస్తు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు గాయపడ్డారు. వారిలో ఒకరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.
కాగా.. భవన నిర్మాణ పనులను సరైన విధంగా చేపట్టకపోవడంతో నాల్గవ అంతస్తు శ్లాబ్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. సమీపంలోని విద్యుత్ వైర్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

