Thu Mar 19 2026 07:19:48 GMT+0530 (India Standard Time)
KTR : నేడు వరంగల్ కు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ నేతలతో సమావేశం కానున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వరంగల్ లో పర్యటించనున్నారు. పార్టీ ముఖ్యనేతలతో జరిగే సమావేశంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
పార్టీ ముఖ్యనేతలతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఇప్పటికే అన్ని పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్యనేతలతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపిక పై చర్చించారు. ఆ మేరకు కేసీఆర్ కు నివేదిక సమర్పించగా అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయింది. దీంతో ఇక కేటీఆర్ కూడా జిల్లాల వారీగా పర్యటిస్తూ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నేతలతో కూడా ఆయన సమావేశం కానున్నారు.
Next Story

