Fri Dec 05 2025 13:16:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేటీఆర్ పర్యటన ఇలా
నేడు వరంగల్, నల్గొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు.

నేడు వరంగల్, నల్గొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలకు ఆయన హాజరుకానున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్ యువకలను ఆకట్టుకునేందుకు ఆయన సభలు నిర్వహించనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో...
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాలను అన్యాయం చేసిందని, అందుకే ఈ ఎన్నికల ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ కేటీఆర్ పిలుపు నివ్వనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుంటే కాంగ్రెస్ దిగివచ్చి తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని కేటీఆర్ చెబుతున్నారు. ఈనెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరగనుంది.
Next Story

