Thu Mar 19 2026 11:54:09 GMT+0530 (India Standard Time)
BRS : నేడు ఆదిలాబాద్ జిల్లాకు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో ప్యటించనున్నారు, రైతు రుణమాఫీ సమస్యలపై చర్చించనున్నారు .

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో ప్యటించనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతురుణమాఫీ సక్రమంగా చేయకపోవడం, రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ సభను ఏర్పాటు చేయనున్నారు.
భారీ బహిరంగ సభలో...
దీనిపై పోరులో భాగంగా ఈ రోజు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కేటీఆర్ జిల్లాకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పెద్దయెత్తున జనసమీకరణ చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలందరితో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై తాజా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. సమస్యలపై ఉద్యమించాలని దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

