Fri Mar 20 2026 07:33:19 GMT+0530 (India Standard Time)
KTR : నేడు సొంత ఖర్చులతో నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత ఖర్చులతో నిర్మించిన పాఠశాల భవానాన్ని నేడు ప్రారంభించనున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత ఖర్చులతో నిర్మించిన పాఠశాల భవానాన్ని నేడు ప్రారంభించనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కొదురుపాకలో జడ్పీ పాఠశాలలో కేటీఆర్ నూతన భవనాలను నిర్మించారు. గతంలో ఈ పాఠశాలలో రెండు గదుల్లోనే ఉండేది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తనసొంత ఖర్చులతో భవనాలను నిర్మిస్తామని చెప్పారు.
అమ్మమ్మ, తాతయ్యల పేరిట...
తన అమ్మమ్మ, తాతయ్యల పేరిట ఈ భవనాలను నిర్మించారు. జోగినపల్లి లక్ష్మి, కేశవరాు పేరిట ఈ నూతన భవనాలను కేటీఆర్ నిర్మించి తన ఉదారతను చాటుకున్నారు. రెండు ఫ్లోర్లలో పద్దెనిమిది గదుల భవనాలను నిర్మించి ఇచ్చారు. వంట గదిని కూడా ప్రత్యేకంగా నిర్మించారు. విద్యార్థులకు పూర్తి స్థాయి వసతులతో ఈ భవనాలను నిర్మించారు. నేడు ఈ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు హాజరుకానున్నారు.
Next Story

