Fri Dec 05 2025 21:48:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సిటీ నేతలో కేటీఆర్ భేటీ
నేడు గ్రేటర్ హైదరాబాద్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు

నేడు గ్రేటర్ హైదరాబాద్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. హైడ్రా కూల్చివేతలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో మూసీ వెంట ఉన్న భవనాలను, ఇళ్లను కూల్చివేస్తుందని, వాటిని అడ్డుకునేందుకు ప్రజలకు అండగా ఏ విధంగా నిలబడాలన్న దానిపై గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నేతలతో చర్చించనున్నారు.
హైడ్రా కూల్చివేతలపై...
న్యాయపరమైన పోరాటానికి వారికి సహకారం అందించడమే కాకుండా, తాము కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని కేటీఆర్ సూచించనున్నారు. ప్రజలు ఇప్పటికే హైడ్రా దెబ్బకు హడలి పోతున్నారని, రానున్నకాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడమే కాకుండా బీఆర్ఎస్ నేతలందరూ మూసీపరివాహక ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని సూచించనున్నారు.
Next Story

