Sat Mar 07 2026 23:02:57 GMT+0530 (India Standard Time)
నేడు మరోసారి ఢిల్లీకి కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఈసారి ఎస్సీ, ఎస్టీ కమిషన్ తో పాటు మహిళా కమిషన్ ను కూడా కేటీఆర్ కలవనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడిచాయి. లగచర్ల బాధితుల అక్రమ అరెస్టులు, వేధింపులపై కేటీఆర్ బాధితులతో కలసి కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు.
లగచర్ల బాధితులతో కలసి...
ఇప్పటికే లగచర్ల మహిళ బాధితులు ఢిల్లీలో ఉన్నారు. ఫార్మా కంపెనీ బాధితులు తమ గోడును కేటీఆర్ తో కలసి ఎస్సీ, ఎస్టీ కమిషన్లతో పాటు మహిళ కమిషన్లకు కూడా ఫిర్యాదు చేయనున్నారు. ప్రభుత్వం తమపై అనుసరిస్తున్న వైఖరిని కమిషన్ కు వివరించనున్నారు. తమను రక్షించాలని కమిషన్ ను బాధితులు కోరనున్నారు.
Next Story

