Sun Mar 15 2026 12:45:25 GMT+0530 (India Standard Time)
KTR : నేడు మహిళ కమిషన్ ఎదుటకు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తెలంగాణ మహిళ కమిషన్ ఎదుటకు హాజరు కానున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తెలంగాణ మహిళ కమిషన్ ఎదుటకు హాజరు కానున్నారు. మహిళా కమిషన్ విచారణకు ఆయన హాజరై తన వివరణ ఇవ్వనున్నారు. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరాలు వెల్లడి కావడంతో మహిళ కమిషన్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.
ఉచిత బస్సు ప్రయాణంపై...
మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు వినిపించాయి. అయితే కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని, మహిళలు నొచ్చుకుంటే క్షమాపణలు కోరుతున్నానని ట్వీట్ చేశారు. అయితే తాను ఈరోజు విచారణకు హాజరై కాంగ్రెస్ నేతలు మహిళలపై చేసిన వ్యాఖ్యలను కూడా మహిళ కమిషన్ దృష్టికి తీసుకెళతానని కేటీఆర్ చెప్పారు.
Next Story

