Wed Jul 16 2025 23:50:46 GMT+0000 (Coordinated Universal Time)
KTR : నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్
ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు.

ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఇప్పటికే కేటీఆర్ ను విచారించిన ఏసీబీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు ఉదయం తన ఇంటినుంచి బయలుదేరి తెలంగణ భవన్ కు చేరుకుని అక్కడ కార్యకర్తలను కలుసుకున్న తర్వాత కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో...
ఫార్ములా ఈ కారు రేసు కేసులో హెచ్ఎండీఏ నిధులను మంత్రి వర్గం ఆమోదం లేకుండా విదేశీ కంపెనీలకు పంపారంటూ ఎనిమిది నెలల క్రితం ఏసీబీ అధకారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న విచారణకు రావాలని కోరినా, తాను విదేశీ పర్యటనకు వెళుతున్నానని, తర్వాత వస్తానని చెప్పడంతో అంగీకరించిన ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఏసీబీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ అభిమానులు చేరుకుంటారని భావించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story