Thu Feb 05 2026 08:23:28 GMT+0000 (Coordinated Universal Time)
షాకు కేటీఆర్ ఘాటు కౌంటర్
కరప్షన్ కు కెప్టెన్ మోదీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కరప్షన్ కు కెప్టెన్ మోదీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ భుజంపై ఎంఐఎం తుప్పుపట్టిన తుపాకీపెట్టి ఎంతకాలం కాలుస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో బలం లేని పార్టీ బీజేపీ అన్న కేటీఆర్ పల్లెపల్లెలో బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని, కేంద్ర నిధులు దుర్వినియోగమా? బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
త్వరలో ఖాళీ....
త్వరలో అధికారంలోకి కాదని, బీజేపీ అంధకారంలోకే నని, త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదని హెచ్చరించారు. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే అనే బలమైన భావనలో ప్రజలున్నారంటూ ఆయన అన్నారు. కారు స్టీరింగ్ కాదు...బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కిందన్న కేటీఆర్ కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం.. విలవిలలాడుతోందన్నారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో బీజేపీ ఫుల్ పిక్చర్ ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారని, ఇంకా ఏ ట్రయిలర్ అవసరం లేదని కేటీఆర్ అన్నారు.
Next Story
