Fri Dec 05 2025 15:13:26 GMT+0000 (Coordinated Universal Time)
KTR : మరో ఇరవై ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాదు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఇరవై ఏళ్లు అధికారంలోకి రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఇరవై ఏళ్లు అధికారంలోకి రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కంచె గచ్చిబౌలి లో నాలుగువందల ఎకరాల భూముల వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామన్న కేటీఆర్ అధికార మదంతో విర్రవీగితే అటువంటి వారికి ప్రజాస్వామ్యంలో తావులేదని అన్నారు. న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగిందని అన్న కేటీఆర్ కంచె గచ్చిబౌలి భూములను విక్రయించేందుకు, చెట్లను నరికేసిన అధికారులను జైలుకు పంపినా తప్పు కాదని అన్నారు.
రాజీనామా చేయాల్సింది...
ఆత్మాభిమున్న ఏ ముఖ్యమంత్రి అయినా ఈ పరిణామంతో రాజీనామా చేస్తారన్న కేటీఆర్ ఈ భూముల విషయంలో పర్యావరణ వేత్తలు విజయం సాధించినట్ల యిందన్నారు. తాము చెప్పిన విషయమే సెంట్రల్ కమిటీ కూడా చెప్పిందని అన్నారు. ఇక్కడ డబ్బులు వసూలు చేస్తూ ఢిల్లీకి పంపుతున్నారని, మూటలు మోయడం కాంగ్రెస్ కు అలవాటేనని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం తమని కూల్చివేస్తామని అనలేదని, ప్రజలే కూల్చివేయాలనుకుంటున్నారని అన్నారన్నారు.
Next Story

