Sun Mar 15 2026 16:05:57 GMT+0530 (India Standard Time)
KTR : ఈ నెల 24న విచారణకు హాజరవుతా
తెలంగాణ మహిళ కమిషన్ ఎదుట విచారణకు ఈ నెల 24వ తేదీన హాజరవుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు

తెలంగాణ మహిళ కమిషన్ ఎదుట విచారణకు ఈ నెల 24వ తేదీన హాజరవుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లో మహిళలపై జరిగిన అన్ని ఘటనలను తాను కమిషన్ కు వివరిస్తానని తెలిపారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మహిళ కమిషన్ నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
అన్ని వివరాలు చెబుతా...
అయితే తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, కమిషన్ ఎదుట హాజరై వాస్తవాలను తెలుపుతానని చెప్పారు. మహిళ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు అన్న మాటలను కూడా మహిళ కమిషన్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తాను అన్న మాటలు యధాలాపంగా అన్నవేనని, మహిళలను బాధించాలన్నది తమ ఉద్దేశ్యం కాదని ఆయన మరోసారి వివరణ ఇచ్చుకున్నారు.
Next Story

