Tue Jul 08 2025 17:22:54 GMT+0000 (Coordinated Universal Time)
KTR : రేవంత్ 8న సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కు రా.. కేటీఆర్ సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రైతుల సంక్షేమంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమని అన్నారు. చర్చ ఎక్కడ పొడతావో పెట్టు.. చింతమడకలో పెడతావా? అసెంబ్లీలో పెడతావా? నీ ఇష్టం...తాము వచ్చి చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీన సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం పదకొండు గంటలకు తాను వస్తానని, రైతు సమస్యలపై చర్చించేందుకు దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు కేటీఆర్. నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేలిపోతాయని అన్నారు.
రైతు సమస్యలపై...
కేసీఆర్ హయాంలో రైతులు పండగ చేసుకున్నారన్నారు. రైతు బీమా ప్రవేశపెట్టింది కేసీఆర్ మాత్రమేనని, రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చింది తెలంగాణలోనేనని కేటీర్ గుర్తు చేశారు. రైతు బంధు పథకలో మొత్తం 39 వేల కోట్ల రూపాయలు రైతులకు ఎగ్గొట్టారని కేటీఆర్ తెలిపారు. అబద్ధాలు మాట్లాడకుంటూ తిరగడం కాదని, చర్చకు సిద్ధమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు బంధు పథకాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించే పరిస్థితి లేదని కేటీఆర్ చెప్పారు. రైతులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రైతుల కోసం తాము ఏం చేశామో చర్చల్లో చెబుతామని కేటీఆర్ అన్నారు.
Next Story