Fri Dec 05 2025 11:40:59 GMT+0000 (Coordinated Universal Time)
KTR : సీఎం రమేష్ కు కేటీఆర్ కౌంటర్
అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపణల పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు

అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపణల పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సీఎం రమేష్ , సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తేహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటలో జరిగిన పదవి వేల కోట్ల కుంభకోణంపైనా, ఫ్యూచర్ సిటీలో ఇచ్చిన రూ.1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కాంపై.. రెండింటిపైనా కలిసి చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం రేవంత్, సీఎం రమేశ్ ఇద్దరి బాగోతం తాను బయటపెట్టడంతో కుడితిలో పడిన ఎలుకలా ఇద్దరూ కొట్టుకుంటున్నారన్న కేటీఆర్ హెచ్.సి.యూ భూములు తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్నవారు పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారన్నారు. తాను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైందన్నారు. దొంగతనం బయటపడటంతో.. అటెన్షన్ డైవర్షన్ కోసం పనికి రాని కథలు చెబుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
విలీనం ప్రసక్తే లేదు...
రూల్స్ ను బ్రేక్ చేయడం.. కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని సీఎం రమేష్ కు కేటీఆర్ సూచించారు. నీ దోస్తు 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా1660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయిందన్న కేటీఆర్ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పస లేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసునని - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Next Story

