Fri Dec 05 2025 14:33:46 GMT+0000 (Coordinated Universal Time)
కాళేశ్వరం సరే... పోలవరం మాటేమిటి?
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ హోదాతో నిర్మించిన పోలవరం కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయినా ఎన్డీఏ నేతలకు కనిపించలేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు

ఆంధ్రప్రదేశ్ లో జాతీయ హోదాతో నిర్మించిన పోలవరం కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయినా ఎన్డీఏ నేతలకు కనిపించలేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అదే కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కూయడం దేనికని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీలకు పోలవరం ప్రాజెక్టును కూలవరం అనే దమ్ము ధైర్మం ఉందా? అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అని తీవ్రంగా ప్రశ్నించారు.
రెండోసారి కొట్టుకుపోయినా...
కళ్లముందు రెండోసారి కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయినా బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ పిల్లర్లపై వెంటనేఎన్డీఎస్ఏను రంగంలోకి దించి విచారించిన బీజేపీ రెండోసారి కొట్టుకుపోయినప్పటికీ పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. పోలవరం కాఫర్ డ్యామ్ పై ఎందుకు మౌనంగా ఉండాల్సివచ్చిందో చెప్పాలంటూ నిలదీశారు. మేడిగడ్డకు కొంతమేరకు పగుళ్లు ఏర్పడితే అక్కడ కనీసం మరమ్మతులుచేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదని, బీజేపీ నేతలకు ప్రశ్నించడానికి నోరు రావడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Next Story

