Sun Mar 22 2026 14:42:45 GMT+0530 (India Standard Time)
KTR : క్రమశిక్షణ దాటారంటే.. ? కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని ఆయన అన్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని ఆయన అన్నారు. ఇకపై ఎమ్మెల్యేల చుట్టూ కార్యకర్తలు తిరిగే విధానం ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలే పార్టీ చుట్టూ తిరిగే విధానం ఉండబోతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీతో పొత్తుపై...
బీజేపీతో గతంలోనూ పొత్తు లేదని, భవిష్యత్ లోనూ ఉండదని తేల్చి చెప్పారు. తాము ఒంటరిగానే లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కలసి కట్టుగా పనిచేసి అత్యధిక స్థానాలను విజయం సాధించేందుకు కృషి చేయాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. బాగా పనిచేసిన కార్యకర్తలకు ఇకపై గుర్తింపు ఉంటుందని కూడా ఆయన చెప్పారు.
Next Story

