Sun Mar 15 2026 06:58:29 GMT+0530 (India Standard Time)
KTR : లండన్ కు వెళ్లిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 20, 21వ తేదీల్లో నిర్వహించే లండన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనిరవర్సిటీ ఆధ్వర్యంలో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలెప్ మెంట్ ఇన్ ఇండియా అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఆయన వివరించానున్నారు.
ఈ నెల 24న తిరిగి హైదరాబాద్ కు...
నిన్న రాత్రి బయలుదేరి వెళ్లిన కేటీఆర్ తిరిగి ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. లండన్ లో దాదాపు నాలుగు రోజుల పాటు కేటీఆర్ పర్యటన ఉంటుంది. అక్కడ తెలంగాణకు చెందిన వారితో కూడా కేటీఆర్ సమావేశమవుతారని తెలిసింది.
Next Story

