Mon Feb 02 2026 04:46:43 GMT+0000 (Coordinated Universal Time)
KTR : నేడు 20 మంది ఎమ్మెల్యేలతో కలసి ఢిల్లీకి కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. ఆయనతో పాటుగా ఇరవై మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. ఆయనతో పాటుగా ఇరవై మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందని భావించి వీరంతా ఢిల్లీ వెళుతున్నట్లు చెబుతున్నారు.
కవిత బెయిల్ పై...
కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి గత ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఇదే కేసులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని భావిస్తున్నారు.
Next Story

