Sun Mar 15 2026 16:05:10 GMT+0530 (India Standard Time)
KTR : కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశముంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై ఏసీబీ అధికారులు లీగల్ టీం తో సమావేశమయ్యారు. ఈరోజు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ తన న్యాయవాదులతో హాజరు కావాలని పట్టుబట్టడంతో పోలీసులు అందుకు అనుమతించలేదు.
విచారణ తేదీని...
దీంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ భవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయితే కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు విచారణకు పిలుస్తారన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో రేపు పిలిచే అవకాశం లేదు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

