Wed Feb 19 2025 14:38:34 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రమంత్రికి కేటీఆర్ లీగల్ నోటీసు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు ఇచ్చారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించారంటూ ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా బేషరతు క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఇటీవల బండి సంజయ్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన నోటీసులతో రెస్పాండ్ అయ్యారు.
పరువుకు భంగం కలిగించారంటూ...
బండి సంజయ్ కేంద్రమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని తెలిపారు. తమపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కేటీఆర్ తెలిపారు. కేవలం బురద చల్లాలన్న ప్రయత్నం మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రిగా తెలంగాన ప్రయోజనాల కోసం పనిచేసిన తనను ఇబ్బంది పెట్టేలా, తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.
Next Story