Fri Dec 05 2025 14:04:34 GMT+0000 (Coordinated Universal Time)
చుక్కనీరు తీసుకెళ్లినా ఒప్పుకోం: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీళ్లు తీసుకుపోతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి తన రేవంత్ నిర్ణయాన్ని మార్చుకోవాలన్న కేటీఆర్ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదన్నారు. తెలంగాణలో కోవర్టు పాలన నడుస్తోందనికాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. గోదావరి జలాలపై బీజేపీ తన వైఖరి చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల లో ఆయన మాట్లడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు డైరెక్షన్ లోనే...
నిన్న ఢిల్లీలో సమావేశం పెట్టించింది, కమిటీ వేసేది చంద్రబాబు అన్న కేటీఆర్ తెలంగాణకు ద్రోహం చేయడానికి కుట్ర జరుగుతోందని అర్థమవుతుందని చెప్పారు. బనకచర్లపై పోరాటానికి ఎక్కడివరకైనా సిద్ధంగా ఉన్నామన్న తారకరామారావు, వాటాలు తేల్చిన తర్వాతే ఏప్రాజెక్ట్ అయినా చేపట్టాలని కోరారు. రేవంత్‌రెడ్డికి ఇరిగేషన్ గురించి తెలియదన్న కేటీఆర్ ఆయనకు రియల్ఎస్టేట్, బ్లాక్ మెయిల్ దందాలే తెలుసునంటూ ఎద్దేవా చేశారు. రాయలసీమకూ ప్రయోజనం కలగాలని కేసీఆర్ ఆకాంక్షించారని కేటీఆర్ తెలిపారు.
Next Story

