Fri Dec 05 2025 09:28:24 GMT+0000 (Coordinated Universal Time)
KTR : రేవంత్ పై ఫైర్ అయిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొదట తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఎయిర్పోర్ట్కు మెట్రో రద్దు చేయడమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ టెండర్లను పిలిచి, భూ సేకరణ జరిగాక కూడా ఆ నిర్ణయాన్ని రద్దు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమలు పర్చలేదని అన్నారు.
మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే...
తాము మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే ఎయిర్పోర్ట్కు మెట్రో లైన్ నిర్మాణం జరిగి మొదలయ్యేదన్నారు. రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టి అన్ని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో తనను అరెస్ట్ చేసినా భయపడేది లేదని అన్నారు. తాను తప్పు చేయలేదని, రాజకీయకక్షతో అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్ విసిరారు.
Next Story

