Thu Mar 19 2026 10:30:36 GMT+0530 (India Standard Time)
KTR : ఓటు వేసిన కేటీఆర్... అందరూ కూడా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్ లో తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేటీఆర్ తన సతీమణి, కామారుడు హిమాన్షుతో కలసి పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. ఆయన వచ్చిన సందర్బంగా అనేక మంది కేటీఆర్ తో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. అయితే సున్నితంగా తిరస్కరించిన కేటీఆర్ తొలుత ఓటు వేయాలని కోరారు.
దేశ అభివృద్ధి కోసం...
ప్రతి ఒక్కరూ తమ ఓటును వేయాలని, ఓటు హక్కు వినియోగంపై నిర్లక్ష్యం తగదని చెప్పారు. ప్రధానంగా యువత ఓట్లు వేసేందుకు ముందుకు రావాలని కోరారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలిపారు.
Next Story

