Fri Mar 20 2026 13:28:32 GMT+0530 (India Standard Time)
నా సీటు వదులుకోవడానికి సిద్ధం : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సీటు వదులుకోవడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సీటు వదులుకోవడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. మహిళ రిజర్వేషన్ బిల్లును ఆయన స్వాగతిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ మహిళ రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమైనదని కేటీఆర్ అన్నారు.
మహిళ రిజర్వేషన్ బిల్లు...
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నదే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య లక్ష్యమని ఆయన వివరించారు. ఒకవేళ రిజర్వేషన్లలో తన సీటు కోల్పోయినా తాను బాధపడనని ఆయన అన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రధాని మోదీకి ఈ విషయంపై లేఖ రాసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
Next Story

