Thu Jan 08 2026 03:51:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఖమ్మంకు కేటీఆర్.. పార్టీ నేతలు మాత్రం?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల గెలిచిన పంచాయతీ సర్పంచ్ లతో ఆయన సమావేశం కానన్నారు. గెలిచిన తమ పార్టీ సర్పంచ్ లకు గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు పార్టీ అండగా ఉంటుందని తెలపనున్నారు.
రేవంత్ తో భేటీ...
మరొకవైపు కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తుండగానే మరొకవైపు ఖమ్మం కార్పొరేషన్ లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లు హైదరాబాద్ కు చేరుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఖమ్మం కార్పొరేషన్ కార్పొరేటర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కొందరు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశముంది.
Next Story

