Fri Feb 13 2026 15:41:05 GMT+0530 (India Standard Time)
బోణీ కొట్టిన బీఆర్ఎస్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని రెండు వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని రెండు వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 11, 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటీ నెలకొంది. మొత్తం మున్సిపాలిటీల్లో 30 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 18 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
హైదరాబాద్ శివార్లలో...
బీజేపీ అభ్యర్థులు ఏడు చోట్ల గెలుపొందారు. కార్పొరేషన్లలో రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని వార్డులోనూ ఒక చోట బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం విశేషం. మొత్తం మీద హైదరాబాద్ నగర శివార్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రారంభంలో అయితే ఏకపక్షంగా మాత్రం కనిపించడం లేదు.
Next Story

