Fri Feb 13 2026 15:39:47 GMT+0530 (India Standard Time)
Breaking : గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ దే
హైదరాబాద్ శివారులో ఉన్న గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది

హైదరాబాద్ శివారులో ఉన్న గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో ఉన్న అధికంగా వార్డులు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడంతో ఆ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్లయింది. మొత్తం 14 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మూడు వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
మున్సిపల్ ఛైర్మన్ గా...
గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ మున్సిపల్ ఛైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక కానున్నారు. కాంగ్రెస్ కేవలం మూడు వార్డులకే ఇక్కడ పరిమితం కావడంతో అక్కడ నామమాత్రంగా మారింది. దీంతో ఒక మున్సిపాలిటీని మాత్రం బీఆర్ఎస్ గెలుకున్నట్లయింది.
Next Story

