Fri Dec 05 2025 13:51:26 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో నేడు బీఆర్ఎస్ నిరసనలు
తెలంగాణ వ్యాప్తంగా నేడు బీఆర్ఎస్ నిరసనలు తెలియజేయనుంది. ధర్నాలకు దిగనుంది.

తెలంగాణ వ్యాప్తంగా నేడు బీఆర్ఎస్ నిరసనలు తెలియజేయనుంది. ధర్నాలకు దిగననుంది. నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలకు బీఆర్ఎస్ హైకమాండ్ పిలుపు నిచ్చింది. రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు నిచ్చింది. దీంతో ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రంలో రైతులతో కలసి బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగనున్నారు.
చేవెళ్లలో కేటీఆర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్లలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు. రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రెండు లక్షల రూపాయల మేరకు రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ ఆందోళలనలకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

