Fri Dec 05 2025 20:39:10 GMT+0000 (Coordinated Universal Time)
BRS : నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసన
తెలంగాణలో నెలకొన్న సమస్యలపై నేడు బీఆర్ఎస్ ఆందోళనకు దిగుతుంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు నిచ్చారు

తెలంగాణలో నెలకొన్న సమస్యలపై నేడు బీఆర్ఎస్ ఆందోళనకు దిగుతుంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు నిచ్చారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతుుల నిరసనకు దిగాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానేడు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కార్యకర్తలకు పార్టీ చీఫ్ కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతు కోసం...
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని అది కూడా ఇవ్వడం లేదని, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయలేదని కోరుతూ నేడు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ ఆందోళనకు దిగాలని పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో ఆందోళనలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
Next Story

