Fri Dec 05 2025 18:26:27 GMT+0000 (Coordinated Universal Time)
BRS : నేడు బీఆర్ఎస్ ప్రచారం... కాంగ్రెస్ కు వ్యతిరేరకంగా
నేడు కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ తెలంగాణలో ప్రచారం నిర్వహించనుంది

నేడు కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ తెలంగాణలో ప్రచారం నిర్వహించనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ నేడు ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో పాటు మెట్రో వంటి ప్రాజెక్టుల నుంచి ఎల్ అండ్ టి వంటి సంస్థలను పంపించడంపై పెద్దయెత్తున ప్రచారం చేయాలని నిర్ణయించారు.
ప్రజల్లోకి వెళ్లి...
దీంతో పాటు హైడ్రా పేదల ఇళ్ల కూల్చివేత విషయంలోనూ ప్రచారాన్ని ఉధృతం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కేవలం పేదల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటూ హైడ్రా కూల్చివేతలను చేపడుతుందని బస్తీల్లోనూ భారీగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించనున్నారు. నేతలందరూ ఇక జనంలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించారు.
Next Story

