Fri Dec 05 2025 11:13:56 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ కు గువ్వల రాజీనామా
బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు

బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తన రాజీనామా ఏకను పంపారు. వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేసినట్లు గువ్వల బాలరాజు తెలిపారు. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా గువ్వల బాలరాజు ఉన్నారు.
9న బీజేపీలో చేరిక...
అయితే గువ్వల బాలరాజు బీజేపీలో చేరే అవకాశముందని చెబుతున్నారు. ఈ నెల 9వ తేదీన బాలరాజు బీజేపీ లో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత నే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. గువ్వల బాలరాజు పార్టీని వీడటంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
Next Story

